అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మరణించాడు. వాటర్‌ఫాల్స్ చూసేందుకు వెళ్లి అందులో పడిపోయి సూర్య అవినాశ్ ప్రాణాలు కోల్పోయాడు.తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన గద్దె శ్రీనివాసరావు కుమారుడు సూర్య అవినాశ్ స్థానికంగా శశిఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. న్యూజెర్సీలో ఉంటూ ఎంఎస్ చదువుతున్న సూర్య అవినాశ్ తన స్నేహితులతో కలిసి వాటర్‌ఫాల్స్ చూసేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారడం తో అందులోనే పడిపోయి మృతి చెందాడు. సూర్య అవినాశ్ మరణవార్త తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.అవినాశ్ మృతితో అతని స్వగ్రామం చిట్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అవినాష్ గద్దె మృతి పట్ల అతడి కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులకు న్యూయార్క్‌లోని భారత రాయబారి కార్యాలయం ఎక్స్ వేదికగా తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అతడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది.