Namaste NRI

అమెరికాలో విషాదం…. ఏపీకి చెందిన భార్యాభర్తలు మృతి

అమెరికాలో మంచు తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తుంది. న్యూజెర్సీలోని అరిజోనాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దంపతులు మంచుతుఫాన్‌లో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ , భార్య హరిత , ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజెర్సీ నగరంలో నివాసముంటున్నారు.  విహార యాత్రకు బయలు దేరిన సమయంలో మంచు తుఫాన్‌ వీరిని కమ్మేసింది. వెంటనే సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. హరిత మృతదేహం లభ్యం కాగా నారాయణ  ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వీరిద్దరి పిల్లలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

న్యూజెర్సీలో జరిగిన ఘటన వివరాలను ఆంధ్రప్రదేశ్‌ లోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఇంట విషాదం నెలకొని ఉంది.మృతదేహాలను స్వస్థలానికి చేర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Social Share Spread Message

Latest News