Namaste NRI

పోర్చుగల్‌లో విషాదం… గాలిలో

పోర్చుగల్‌లోని జరిగిన ఎయిర్‌ షోలో  విషాదం చోటుచేసుకున్నది. రెండు విమానాలు గాలిలో ఢీకొనడంతో ఓ పైలట్‌ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోర్చుగల్‌లోని బెజా విమానాశ్రయంలో ఎయిర్‌ షో జరుగుతున్నది. డజన్ల కొద్ది మిలటరీ విమానాలు, హెలికాప్టర్లు ఒకచోట చేరాయి. పైలట్లు తమ సాహసాలను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు విమానాలు గాల్లో ప్రదర్శన చేస్తున్నాయి. అందులో ఓ విమానం మరోదానిని ఢీకొట్టింది. దీంతో అది కుప్పకూలిపోయింది.

ఈ ప్రమాదంలో స్పెయిన్‌కు చెందిన పైలట్‌ అక్కడికక్కడే మరణించారు. పోర్చుగల్‌ జాతీయుడైన మరో పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని బెజా దవాఖానకు తరలించామని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు తరలించారు. ప్రమాదానికి గురైన విమానాలు యాకొవెల్వ్‌ యాక్‌-2 అని, అవి సోవియట్‌ డిజైన్డ్‌ ఏరోబేటిక్‌ ట్రైనింగ్‌ మోడల్‌కు చెందినవని తెలిపారు. ఈ ప్రమాదంపై పోర్చుగల్‌ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతోషకరమైన సందర్భం కాస్తా విషాదంగా మారిందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events