Namaste NRI

విషాదం.. అమెరికాలో భారతీయ కుటుంబం

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన దంపతులతో పాటుగా వారి ఇద్దరు పిల్లలు తమ ఇంట్లో చనిపోయి ఉండగా పోలీసులు కనుగొన్నారు. వీరంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుని ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్, ఆయన భార్య సోనాల్ పరిహార్(42), పదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తెతో పాటుగాప్లెయిన్స్‌బరోలోని తమ ఇంట్లో చనిపోయి ఉండగా కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మూకుమ్మడి ఆత్మహత్యల కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ యోట్డా సికోన్, ప్లెయిన్స్‌బోరో పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన చీఫ్‌ఈమోన్ మ్లాన్‌చార్డ్ చెప్పారు. ప్లెయిన్స్‌బోరోలోని ఓ ఇంటివద్దనుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చిందని, తాము అక్కడికి వెళ్లి చూడగా, ఇంటిలో నలుగురు చనిపోయి ఉండడం కనిపించిందని వారు తెలిపారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలకు ఈ రోజు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దంపతులు తమతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని చుట్టుపక్కల కుటుంబాలు తెలిపారు. భార్యాభర్తలిద్దరూ కూడా ఐటి రంగంలో పని చేసే వారని తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events