ఉన్నత విద్యా చదువులు చదివి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు తన కుటుంబంతో అమెరికా వెళ్లాడు. విహారయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృత్యుఒడికి చేరాడు. విజయవాడ సమీపంలోని పోరంకి వసంత్నగర్ కాలనీకి చెందిన నెక్కలపు హరీష్ చౌదరి (35) ఎంటెక్ పూర్తి చేసి కెనడాలో టూల్ మేకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ విహారయాత్రకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ఇతాకా జలపాతంలో జారిపడి మృతి చెందాడు. హరీష్ మృతితో కుటుంబ సభ్యుల్లో పెను విషాదం నెలకొంది.