Skip to main content

Namaste NRI

తెలుగు మ్యూజికల్ డ్రామా.. జగమే సంగీతం ట్రైలర్‌ రిలీజ్

ప్రకాష్‌రాజ్‌, మేక శ్రీకాంత్‌, మధుబాల, అక్షయ్‌ లగుసాని, సుష్మితశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ జగమే సంగీతం. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను సుస్మిత కొణిదెల నిర్మించారు. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎనిమిది ఎపిసోడ్‌లలో మ్యూజికల్‌ డ్రామాగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

కర్ణాటక సంగీత సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలు, సంఘర్షణ నేపథ్యంలో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దామని మేకర్స్‌ తెలిపారు. తాను ఈ సినిమాలో కర్ణాటక సంగీత పండితుడు శాస్త్రి పాత్రలో కనిపిస్తానని, సంగీతం ప్రజలను ఎలా ఏకం చేస్తుందో తెలిపే అంశాన్ని ఈ సిరీస్‌లో అద్భుతంగా చూపించారని ప్రకాష్‌రాజ్‌ పేర్కొన్నారు. ఆర్టిస్టులంతా ఈ కథకు ప్రాణం పోశారని దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events