
సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. మోహన్‌శ్రీవత్స దర్శకత్వం. ఈ చిత్రానికి విజయ్‌పాల్ రెడ్డి నిర్మాత. సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచిరాయ్, ఉదయభాను కీలక పాత్రధారులు. ఈ సినిమా నుంచి అనగా అనగా కథలా అంటూ సాగే ఓ పాటను హైదరాబాద్ టీకేఆర్ కాలేజీలో విడుదల చేశారు. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ బాణీ అందించిన ఈ పాటను సనరే రచించారు. కార్తీక్ ఆలపించారు. తాత, మనవరాలి మధ్య ఉండే అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ హృద్యంగా సాగిందీ పాట. పౌరాణిక, సమకాలీన అంశాల కలబోతగా సాగే ఫాంటసీ కథాంశమిదని, తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్, సమర్పణ: మారుతీ టీమ్ ప్రొడక్ట్స్, రచన-దర్శకత్వం: మోహన్‌శ్రీవత్స.
