అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే చేశారు. ఏప్రిల్ 2న భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ఒక్కో దేశానికి ఒక్కో టారిఫ్‌ను విధించారు. అత్యధికంగా కంబోడియా దిగుమతులపై 49 శాతం, భారత్‌పై 26 శాతం టారిఫ్‌ను వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆయన పరస్పర సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలకు మినహాయింపు లభించింది.

అందులో రష్యా తోపాటు ఉత్తర కొరియా , బెలారస్, క్యూబా సహా పలు దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలపై ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సుంకాలు వర్తించవని వైట్‌హౌస్ వెల్లడించింది. ఇప్పటికే అమెరికా ఆంక్షలు ఉన్న ఇరాన్, సిరియా దేశాలు మాత్రం సుంకాల దెబ్బను ఎదుర్కోక తప్పలేదు. ఆయా దేశాలపై 10, 40 శాతం సుంకం విధిస్తున్నట్లు తాజాగా అధ్యక్షుడు ప్రకటించారు.
