అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇడాహో, మిస్సోరీ, మిషిగన్‌లో జరిగిన ప్రైమరీలో ఆయన విజయం సాధించారు. దీంతో ఆయనకు మద్దతు పలికే డెలిగేట్ల సంఖ్య 244కు చేరింది. ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీకి 24 మంది డెలిగేట్లు మాత్రమే మద్దతిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రావాలంటే, కనీసం 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. వచ్చే మంగళవారం 16 రాష్ర్టాల్లో ఓటింగ్ జరుగుతుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)