
వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేశారు. ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే ఏ దేశం పైన అయినా సరే ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తానని ప్రకటించారు. అమెరికా శత్రు దేశాలతో పాటు మిత్ర దేశాలపై కూడా ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. అమెరికా పట్ల వెనిజులా చాలా శతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. కాబట్టి ఆ దేశం నుండి చమురు లేదా గ్యాస్ కొనుగోలు చేసే ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యం నెరిపితే ఇరవై ఐదు శాతం సుంకం చెల్లించాల్సిందే అని ట్రంప్ స్పష్టం చేశారు.ట్రంప్ హెచ్చరికలు భారత్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
