ప్రపంచ వ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2025ను ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులకు చోటు దక్కింది.

2025 టైమ్ మ్యాగజైన్ రాజకీయాలు, సైన్స్, వ్యాపారం, వినోదం ఇలా పలు కేటగిరీల నుంచి 100 మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్, యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ వంటి అనేక మంది ప్రపంచ నాయకులు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్,పాపులర్ సింగర్ ఈద్ షరీన్,ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్ ల పేర్లు కూడా ఉన్నాయి. అయితే, ఈ సారి భారత్‌కు చెందిన వారెవరికీ ఇందులో చోటు దక్కకపోవడం గమనార్హం.
