Namaste NRI

సీఐఏ చీఫ్‌గా భారతీయుడికే ట్రంప్ ఛాన్స్

సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్‌గా క‌శ్య‌ప్ ప‌టేల్‌ కు అవకాశం ద‌క్క‌నున్న‌ది. అమెరికా కొత్త అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భార‌తీయ సంత‌తికి వ్య‌క్తికి ఆ కీల‌క ప‌ద‌విని అప్ప‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ట్రంప్ కోసం ఏప‌ని అయినా చేసేందుకు క‌శ్య‌ప్ సిద్దంగా ఉన్నారు. అయితే క‌శ్య‌ప్ ప‌టేల్‌కు గుజ‌రాతీ మూలా లు ఉన్నాయి. ఈస్ట్ ఆఫ్రికాలో ఆయ‌న పేరెంట్స్ పెరిగారు. 1970 ద‌శ‌కంలో ఆయ‌న తండ్రి ఉగాండా నుంచి వ‌ల‌స వ‌చ్చారు.  1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో ఆయ‌న జ‌న్మించారు. హిందువుగా ఆయ‌న పెరిగారు. వ‌ర్ణ వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న పోరాడారు. రిచ్‌మండ్ యూనివ‌ర్సిటీలో ఆయ‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. న్యూయార్క్‌లో లా డిగ్రీ చ‌దివారు. యూకేలోని యూనివ‌ర్సిటీ కాలేజీ లండ‌న్ ఫాక‌ల్టీ ఆఫ్ లాస్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ లా స‌ర్టిఫికేట్ పొందారు. ర‌క్ష‌ణ‌శాఖ మాజీ కార్య‌ద‌ర్శి క్రిస్టోఫ‌ర్ మిల్ల‌ర్ వ‌ద్ద ప‌నిచేశారు. నేష‌న‌ల్ సెక్యూర్టీ కౌన్సిల్‌లో కౌంట‌ర్ టెర్ర‌రిజం సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌గా చేశారు.

గ‌తంలో డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వ స‌మ‌యంలో ఐసిస్‌, ఆల్‌ఖ‌యిదా కీల‌క నేత‌ల హ‌త్య‌ల‌కు మిష‌న్ న‌డిపించా రు. హౌజ్ క‌మిటీకి చెందిన ఇంటెలిజెన్స్‌కు నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌ర్‌గా చేశారు. 2016 ఎన్నిక‌ల్లో ర‌ష్యా ప్ర‌మేయంపై విచార‌ణాధికారిగా చేశారు. లాయ‌ర్‌గా అనేక కేసుల్ని వాదించారు. హ‌త్య‌లు, నార్కో ట్రాఫికింగ్‌, ఆర్థిక నేరాల గురించి ఫెడ‌ర‌ల్ కోర్టుల్లో వాదించారు. 2019లో ట్రంప్ టీంలో క‌శ్య‌ప్ పటేల్ చేరిన‌ట్లు తెలిసింది. గ‌త పాల‌న స‌మ‌యంలో సీఏఐ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా క‌శ్య‌ప్ ప‌టేల్‌ను నియ‌మించాల‌ని ట్రంప్ ప్లాన్ వేసిన‌ట్లు తెలిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress