Namaste NRI

గెలుపు తర్వాత ట్రంప్‌ కీలక నిర్ణయం.. వైట్‌హౌజ్‌ చీఫ్‌గా ఆమెకు బాధ్యతలు

అమెరికా దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌ శ్వేత సౌధానికి మేనేజ‌ర్‌ను నియ‌మించారు. త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో మేనేజ‌ర్‌గా ఉన్న సుసాన్ స‌మ్మ‌ర్వాల్ వైల్స్‌ ను వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిపై ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అమెరికా చ‌రిత్ర‌లో ఓ గొప్ప రాజ‌కీయ‌ విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంలో హెల్ప్ చేసిన వైల్స్‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌ను అప్ప‌గిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే శ్వేత‌సౌధంలో కీల‌క బాధ్య‌త‌ల‌ను చేప‌డుతున్న తొలి మ‌హిళ‌గా వైల్స్ రికార్డు సృష్టించ‌నున్నారు.

అధ్య‌క్షుడి ప‌రిపాల‌న‌లో వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కీల‌క పాత్ర ఉంటుంది. వైట్‌హౌజ్‌కు మేనేజ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తారు. దేశాధ్య‌క్షుడికి కావాల్సిన స్టాఫ్‌ను మేనేజ‌రే నియ‌మిస్తారు. ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ద్వారా త‌మ ప‌ని చేస్తారు. రోజు వారీ కార్య‌క్ర‌మాలు, సిబ్బంది ప‌నుల‌పై వైట్‌హౌజ్ మేనేజ‌ర్కు అధికారం ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో విధాన నిర్ణ‌యాల్లోనూ దేశాధ్య‌క్షుల‌కు స‌ల‌హాలు ఇస్తుంటారు. పాల‌సీ డెవ‌ల‌ప్మెంట్ అంశంలో దిశానిర్దేశం కూడా చేస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events