అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రారంభం కానున్న బాక్సింగ్ మ్యాచ్ నేపథ్యంలో ఒక జర్నలిస్టు ఫోన్‌లో ట్రంప్‌తో మాట్లాడారు. బ్యాక్సింగ్‌లో ఎవరితో పోటీపడాలని భావిస్తున్నారని అడిగారు. దీనికి ట్రంప్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. నేను ప్రపంచంలో ఎవరినైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే, కేవలం ప్రొఫెషనల్ బాక్సర్‌తో మాత్రమే కాదు, జో బైడెన్‌పై కూడా తలపడతాను. బహుశా నేను బైడెన్‌పై సులువుగా పోరాడుతానని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా చాలా త్వరగా డౌన్ అవుతారని భావిస్తున్నా. ఆయన చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉన్నారు. మొదటి కొన్ని సెకండ్లలో బైడెన్ ఓడిపోతారని అనుకుంటున్నా అని ట్రంప్ అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఇరు వర్గాల అభిమానులు కూడా రెచ్చిపోతున్నారు. కొంతమంది ఏకంగా బైడెన్, ట్రంప్‌ల ఫోటోలను మార్ఫ్ చేసి బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేస్తున్నట్లు కార్టూన్లు సృష్టించి షేర్ చేస్తున్నారు. ఇక కొంతమంది ట్రంప్‌పై మీమ్స్, జోక్స్‌తో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట వీరిద్దరి బాక్సింగ్ మీమ్స్, జోక్స్ వైరల్ అవుతున్నాయి.