అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, 2020లో అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులో ఒకరుగా పోటీ పడిన తులసి గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. యుద్ధోన్మాదులైన ఉన్నత వర్గంతో డెమోక్రటిక్ పార్టీ నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుల్సీ గబ్బార్డ్ అమెరికా చట్ట సభకు ఎన్నికైన తొలి హిందూ అమెరికన్. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ కోసం యత్నించిన తొలి హిందువుగా తుల్సీ గబ్బార్డ్ చరిత్రకెక్కారు. ఇరవై ఏళ్లుగా డెమొక్రటిక్ పార్టీతో అనుబంధం ఉన్న ఆమె శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా డెమొక్రటిక్ పార్టీ జాత్యహంకారం ప్ర్రదర్శిస్తోందని తులసీ ఆరోపించారు. 41 ఏళ్ల గబ్బార్డ్ గతేడాది ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) నుంచి పదవీ విరమణ చేశారు.
