తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, వెంకటేష్ కాకుమాను, విష్ణు ప్రధాన పాత్రల్లో అనిల్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం తులసీవనం. ఈ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. వినోదానికి పెద్దపీట వేశారు. తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ దర్శకుడు అనిల్ పెళ్లి చూపు లు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. నిజాయితీతో ఈ సినిమా తీశాడు. న్యూఏజ్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ కథ నేటితరంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని, క్యూట్ రొమాంటిక్ కామెడీగా మెప్పిస్తుందని దర్శకుడు అనిల్ రెడ్డి అన్నారు. ఈ నెల 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌సాగర్, సంగీతం: స్మరన్.