Namaste NRI

ఫ్రాన్స్‌లో కలకలం.. పదేండ్ల పాటు

72 మంది అపరిచితులతో తన భార్య(72)పై పదేండ్లపాటు లైంగిక దాడి చేయించిన ఓ భర్త అకృత్యం ఫ్రాన్స్‌ లో కలకలం రేపుతున్నది. ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మొత్తం 92 సార్లు బాధితురాలిని 72 మంది రేప్‌ చేశారని, వీరిలో 51 మందిని గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడు శక్తివంతమైన మత్తు మందు లిచ్చి ఆమెపై లైంగిక దాడులు చేయించినట్టు తెలిసింది. తనపై జరిగిన అకృత్యాల గురించి వీలైనంత మందికి అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని బాధితురాలు కోరుకుంటు న్నదని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.

2020లో బాధితురాలు తనపై జరిగిన అకృత్యాలను గుర్తించింది. నిందితుడు డొమినిక్యూ పి సెప్టెంబర్‌ 2020లో ఓ షాపింగ్‌ సెంటర్‌లో ముగ్గురు మహిళల స్కర్ట్ల కింది భాగాన్ని వీడియో తీస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డ్‌ పట్టుకున్నాడు. అతడి కంప్యూటర్‌లో అతడి భార్యపై జరిగిన లైంగిక దాడులకు సంబంధించిన వందలాది ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events