మైక్రో బ్లాగింగ్ సైట్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడాన్ని ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. 44 బిలియన్ డాలర్ల డీల్ కోసం కంపెనీని టేకోవర్ చేయడానికి మస్క్ బిడ్ చేసిన విషయం విదితమే. ఒకానొక సమయంలో దీనిని రద్దు చేస్తానని బెదరించారు. బోర్డు ఆమోదంతో ఒప్పందం ముగుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందానికి బోర్డు ఆమోదం తెలపడంతో మస్క్ డీల్ విషయంలో ముందడుగు వేశారు. డీల్‌ను ముగించడానికి మస్క్‌కు తగిన నిధులు కూడా అవసరమని తెలుస్తోంది. ఈ ప్రాక్సీ స్టేట్‌మెంట్‌లోని విభాగంలో వివరించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత వీలినాన్ని ఆమోదించినట్లు ట్విట్టర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో తెలిపింది. ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో మస్క్ మాట్లాడుతూ డీల్‌కు అడ్డుగా వస్తున్న పరిష్కారం కాని విషయాల్లో వాటాదారుల ఆమోదం ఒకటి అని చెప్పారు. నకిలీ ఖాతాల సంఖ్య గురించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. నకిలీ ఖాతాల సంఖ్యు 5 శాతం కంటే తక్కువగా ఉందని ట్విట్టర్ పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)