Namaste NRI

వినియోగదారులకు ట్విట్టర్‌ షాక్‌

 ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను ఇటీవల కొనుగోలు చేసిన టెస్లా సీఈవో ఎలాన్‌ మాస్క్‌ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. దీనిలో భాగంగా ట్విట్టర్‌ వినియోగదారులకు షాక్‌ ఇవ్వబోతున్నారు.  త్వరలో పెయిడ్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి బ్లూటిక్‌ సహా ఇతర అదనపు ఫీచర్లపై ఒక్కో వినియోదారుడి నుంచి నెలకు 19.99 డాలర్ల చొప్పున వసూలు చేయాలని యోచిస్తున్నారు నవంబర్‌ 7లోగా పెయిడ్‌   వెరిఫికేషన్‌ను ప్రారంభించాలని, లేకపోతే వెంటనే ఉద్యోగాలను వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేస్తూ ట్విట్టర్‌ ఉద్యోగలుకు ఎలాన్‌ మస్క్‌ తొలి గడువు విధించినట్లు తెలిసింది. ప్రస్తుతం ట్విట్టర్‌లో బ్లూటిక్‌ సహా అదనపు ఫీచర్లను   ట్వీటర్‌ బ్లూ పేరుతో నెలకు 4.99 డాలర్లకే  వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ ప్యాక్‌లో ప్రకటనలు (యాడ్స్‌) లేని ఆర్టికల్స్‌, ప్రత్యేక రంగుతో ఉండే హోంస్క్రీన్‌ ఐకాన్‌ అంతర్భాగంగా ఉంటాయి.

Social Share Spread Message

Latest News