కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా మీటర్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. జెవి ఆర్ట్ డైరెక్టర్. అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ కాగా, బాబా సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రమేష్ కాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు రమేష్ కాదూరి మాట్లాడుతూ టీజర్, పాటలు, ట్రైలర్ సక్సెస్ అయ్యాయి. ఇక సినిమానే మిగిలింది. మూవీ మిమ్మల్ని తప్పకుండా థియేటర్‌లో అలరిస్తుంది అన్నారు.
నిర్మాత చెర్రీ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పగానే మాస్ కమర్షియల్ చిత్రం అవుతుందని నమ్మకం కలిగింది. రేపు థియేటర్‌లో సినిమా చూస్తే కొత్త దర్శకుడు రూపొందించాడని అనిపించదు. కిరణ్ తొలిసారి మాస్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంటారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ చిత్రమవుతుంది అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ 75 రోజులు రాత్రీ పగలు కష్టపడి ఈ సినిమా చేశాం. నేను పరిశ్రమకు వచ్చి ఐదేండ్లవుతున్నది. కానీ ఇలాంటి మాస్ సినిమాలో నటించే అవకాశం రాలేదు. ఈ సినిమా మీరు ఊహించినదాని కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ వినోదాన్ని అందిస్తుంది. టీజర్, ట్రైలర్ లాగే సినిమా కూడా పరుగులు పెడుతుంది అన్నారు. ఈ చిత్రానికి బాల్ సుబ్రమణ్యం కెవివి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో నాయిక అతుల్య రవి, సంగీత దర్శకుడు సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.