Namaste NRI

అమెరికాలో తుఫాన్ బీభత్సం..రెండు వేల విమానాలు రద్దు

 శీతాకాల‌పు తుపాను ప్ర‌భావంతో ఆమెరికా వ్యాప్తంగా తీవ్ర మంచు అలుముకుంది. దీంతో ప్ర‌జ‌లు జీవ‌నం స్తంభించిపోయింది. అలాగే ర‌వాణ వ్య‌వ‌స్థ కార్య‌కాపాలాలు ఆగిపోయాయి. ముఖ్యంగా మిడ్వెస్ట్, చుట్టు పక్కల రాష్ట్రాలు  తలాకుతలమవుతున్నాయి. ఏకంగా 2000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 2400 ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్అవేర్.కామ్ డేటా స్పష్టం చేసింది.  దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుపోయారు.

చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం 40 శాతం విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో 36 శాతం విమానాలు ఈ ఎయిర్ పోర్టుకు కావాల్సి ఉంది. ఇక చికాగో మిడ్వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావాల్సిన 60 శాతం విమాన సర్వీసులు రద్దయ్యాయి. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు పలు ఎయిర్పోర్టులు పెద్ద సంఖ్యలో విమానాలను రద్దయ్యాయి. 737 మ్యాక్స్ 9 విమానాల ల్యాండింగ్లో ఇబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఫ్లైట్స్ రద్దు కావడానికి ఒక కారణంగా ఉంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) మార్గదర్శకాలను దృష్టి పెట్టుకొని పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events