యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరులపై విధించిన ప్రయాణ ఆంక్షలను తొలగించింది. పౌరులు ఇకపై అన్ని దేశాలకు ప్రయాణించొచ్చు అని ప్రకటించింది. యూఏఈ ప్రభుత్వం 12 ఆప్రికన్ దేశాలపై నిషేధం విధించింది. యూఏఈ పౌరులు ఆ దేశాలకు వెళ్లకూడదు అని ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలను తాజాగా ప్రభుత్వం ఎత్తేసింది. గుర్తింపు పొందిన కొవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న పౌరులు ఇక ఆఫ్రికన్ దేశాలకు కూడా ప్రయాణించొచ్చని వెల్లడిరచింది. చికిత్సలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్ నుంచి మినహాయింపు పొందిన పౌరుల ప్రయాణానికి కూడా యూఏఈ ప్రభుత్వం అనుమతించింది. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 6 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడిరచింది. అయితే వ్యాక్సిన్ తీసుకొని పౌరులు మాస్కులు ధరించడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలని సూచించింది.