కరోనా నేపథ్యంలో పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సడలించింది. భారత్ సహా 15 దేశాల పౌరులను సెప్టెంబరు 12 నుంచి తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రాలియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా, అఫ్గానిస్థాన్ దేశాల పౌరులకు అనుమతి కల్పిస్తున్నట్లు యూఏఈ ఆ ప్రకటనలో వెల్లడిరచింది. తమ దేశానికి రావాలనుకునే ప్రయాణికులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకోవడంతో పాటు ఆర్‌టీ`పీసీఆర్ నెగెటివ్ పత్రం కూడా చూపించాలని పేర్కొంది.