యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన కస్టమ్స్ విభాగం ఆ దేశానికి వెళ్లే లేదా అక్కడి నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారికి కొత్త నిబంధన తీసుకొచ్చింది. 60వేల దిర్హమ్స్ కంటే ఎక్కువ నగదు, విలువైన ఆభరణాల వివరాలను ప్రయాణీకులందరూ తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు యూఏఈలోని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ ప్రయాణీకులకు రిమైండర్ జారీ చేసింది. సురక్షితమైన ప్రయాణాల కోసం ప్రయాణికులందరూ కస్టమ్స్ చట్టంలో పేర్కొన్న విధంగా కస్టమ్స్ విధానాలకు కట్టుబడి ఉండడం ఎంతో అవసరమని అందులో పేర్కొన్నారు. కాగా, యూఏఈ గుండా వెళ్లే ప్రయాణీకులకు నగదు పరిమితి లేదన్నారు. కానీ, 60వేల దిర్హమ్స్ కంటే ఎక్కువ మొత్తాన్ని తప్పనిసరిగా ప్రకటించాలని అథారిటీ స్పష్టం చేసింది.














