Namaste NRI

యూఏఈ  తీపి కబురు…వీసా గడువు ముగిసినా లేదా రద్దైనా

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వలసదారులకు తీపి కబురు చెప్పింది. రెసిడెన్సీ వీసా రద్దు లేదా గడువు ముగిసిన తర్వాత దేశాన్ని విడిచి వెళ్లేందుకు గ్రేస్‌ పీరియడ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న రెండు నెలల వ్యవధిని ఆరు నెలలకు పెంచింది. ఈ మేరకు ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్‌, కస్టమ్స్‌ అండ్‌ పోర్ట్‌ సెక్యూరిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా తాజాగా పెంచిన 180 రోజులు గ్రేస్‌ పీరియడ్‌ అనేది ఏ కేటగిరీల వారికి వర్తిస్తుందో కూడా ఐసీసీ తెలియజేసింది. ఇది ప్రధానంగా గోల్డెన్‌ వీసాదారులు, గ్రీన్‌ వీసా హోల్డర్స్‌తో పాటు  వారి ఫ్యామిలీ మెంబర్స్‌, చదువు పూర్తైన విద్యార్థులు, నైపుణ్యం కలిగిన నిపుణులకు వర్తిస్తుంది.  ఇక 90 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ అనేది నైపుణ్యం కలిగిన  నిపుణులు, ఎమిటరేట్స్‌లో ఆస్తులు కలిగిన యజమానులకు వర్తిస్తుందని పేర్కొంది. అలాగే 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ సాధారణ నివాసితులకు వర్తిస్తే 30 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ అనేది ఇతర కేటగిరీలకు చెందినవారికి వర్తిస్తుందని తెలిపింది.

          సాధారణంగా ప్రవాసులు వీసా క్యాన్సిల్‌ అయిన తర్వాత గ్రేస్‌ పీరియడ్‌ ముగిసేలోగా దేశం నుంచి వెళ్లడం లేదా కొత్త వీసా పొందాల్సి ఉంటుంది. యూఏఈ  తీసుకున్న తాజా నిర్ణయం పట్ల వలదారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయాల్లో ఇది  ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress