Namaste NRI

కాన్సాస్ సిటీలో ఘనంగా ఉగాది వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (టిఎజికెసి) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓలేత నార్త్‌ వెస్ట్‌ హైస్కూల్‌లో  ఎంతో ఘనం గా జరిగాయి.  ప్రోగ్రాం కమిటీ చైర్‌పర్సన్‌ యామిని వల్లేరు ఆహ్వానితులకు ఉగాది  శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

హిందూ టెంపుల్ అఫ్ కాన్సాస్ సిటీ పూజారి శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం, వారి అర్థవంతమైన వివరణ, ఆశీర్వచనాలు వేడుకకు ఆధ్యాత్మిక మాధుర్యం జోడించాయి. బోర్డ్‌ ఆఫ్ ట్రస్టీస్ చైర్ శ్రీ శ్రీని పెనుగొండ తమ నూతన బోర్డు సభ్యులను అందరికీ పరిచయం చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రావణి మేక నూతన కార్యవర్గ సభ్యులను పరిచయం చేస్తూ వారు కాన్సాస్‌లోని తెలుగు వారికి చేస్తున్న సేవను కొనియాడారు.  ఇతర సంస్థల మహిళా నాయకులైన ఉషా సాహ, అభిరుచి సింగ్, కళై పద్మనాభన్‌ను బోర్డు సభ్యులు సరితా ఎడ్మ, దీప్తి వొడ్నాల, శ్రావణి మేక సన్మానించారు.ఆర్ట్స్, చెస్, పికిల్ బాల్ పోటీల్లో విజేతలకు, రాఫెల్ విన్నర్లకు బహుమతులు స్పోర్ట్స్ చైర్ సురేశ్‌ తుమ్మల, బోర్డు సభ్యులు అభిరాం దువ్వూరి అందచేశారు. కళాత్మక ప్రదర్శనలతో వేదిక నిండిపోయింది. కూచిపూడి, భారతనాట్యం వంటి నృత్యరూపాలతో పాటు సినిమా పాటల డాన్సులతో పిల్లలు, పెద్దలు అందరినీ అలరించారు. వారి నైపుణ్యం, సంస్కృతిని ప్రతిబింబించడంలో వారు చూపిన కృషి మాకు ఎంతో గర్వకారణంగా నిలిచాయి.

ఈ కార్యక్రమాన్ని యాంకర్ దీప్తి యాయవరం ఎంతో సజావుగా నడిపించారు. చివరిగా కమిటీ వైస్ ప్రెసిడెంట్ మధు గంట కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన దాతలకు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలుపుతూ భారత జాతీయ గీతంతో ముగించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికి ఫుడ్ కమిటీ చైర్ శ్రీ ఉమాకాంత్ పార్శి గారి ఆధ్వర్యంలో అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ కమ్మని విందును అందించారు. ఈ కార్యక్రమానికి సుమారు 750 మంది హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events