Namaste NRI

ఖతార్‌లో ఆంధ్రకళా వేదిక ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు

ఉగాది పండుగని పురస్కరించుకొని ఆంధ్ర కళా వేదిక – ఖతార్ కార్యనిర్వాహక వర్గం ఉగాది వేడుకలు కార్యక్రమాన్ని ఖతార్‌లోని ప్రతిష్టాత్మక వేదిక రేతాజ్ సల్వా రిసార్ట్  లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయ మొదటి కార్యదర్శి (రాజకీయ & సమాచారం) పద్మ కర్రీ మాట్లాడుతూ బాషా, కళా, సాంస్కృతిక, సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు మహిళా సంగీత స్వర కర్త, ప్లే బ్యాక్ సింగర్ ఎం. ఎం. శ్రీలేఖ తన సంగీత ప్రయాణంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 25 దేశాలలో ప్రదర్శనలు చేసే ప్రపంచ పర్యటనలో భాగంగా మొట్టమొదటి ప్రోగ్రామ్‌గా ఖతార్ లో ఆంధ్ర కళా వేదిక నిర్వహించిన ఉగాది వేడుకలు కార్యక్రమంతో దిగ్విజయంగా ప్రారంభించారు. ఆమెతో పాటు ప్లేబ్యాక్ సింగర్స్ సాకేత్ కొమాండూరి, జానపద గాయని మౌనిక, సింగర్ రవి, ఇమిటేషన్ రాజు కూడా తమ పాటలతో, మాటలతో, ఆటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించి ఉర్రూతలూగించారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు శ్రీ వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఖతార్ లోని తెలుగు సంఘాలలో చరిత్ర సృష్టించిందని, కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని, వేదిక ప్రాంగణ పరిమితికి మించి అభ్యర్థనలు రావడంతో చాలామందికి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పించ లేకపోయామని, హాజరైన ప్రేక్షకులు సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు అని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్  నుంచి వినోద్ నాయర్-A/ ప్రెసిడెంట్, కుల్దీప్ కౌర్, శ్రీ కున్హి, దీపక్ శెట్టి, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) నుంచి కృష్ణ కుమార్-ప్రధాన కార్యదర్శి, కే.ఏస్. ప్రసాద్-సలహా మండలి చైర్మన్, సత్యనారాయణ , సజీవ్ సత్యశీలన్, మోహన్ ఇతర సంఘాల ప్రతినిధులు రవీంద్ర ప్రసాద్, తెలుగు ప్రముఖులు నందిని అబ్బగౌని, సత్య అనుమళ్ల, హరీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి ప్రత్యేకించి రవి మెలోడీస్ అధినేత శ్రీ రవి గారికి, IGPL అధినేత శ్రీ శ్యామ్ బాబు గంధం గారికి, శ్రీ R మాధవరావు పట్నాయక్ గారికి, శ్రీ GVNRSSS వరప్రసాద్ గారికి శాలువా మరియు జ్ఞాపికలతో సత్కరించి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు శ్రీ గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, శ్రీ సుధ, సోమరాజు, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, KT రావు, శిరీష రామ్, వీబీకే మూర్తి బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి ప్రత్యేకించి మధు వంటేరు, గోవర్ధన్ అమూరు, ఎల్లయ్య, మను & టీంకి మరియు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లితండ్రులకు, Emote Edition రవి మరియు జ్యోతి గారికి కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress