తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ (టీఏఎస్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జ్యురిక్ నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా మహిళలందరు దీపారాధన కార్యక్రమాలతో మొదలుపెట్టారు. పవన్ దుద్దిళ్ల పంచాంగ శ్రవణం వినిపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నా యి. ఈ కార్యక్రమంలో తెలుగు వారందరూ పాల్గొని ఎంతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో టీఏస్ అధ్యక్షుడు తాటికొండ కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి చింతారెడ్డి హరీశ్, కోశాధికారి పొడుగు రామారావు, మీడియా అడ్వైజర్ కార్యదర్శి పెంటపాటి ఉజ్వల, సాంస్కృతిక కార్యదర్శి కొప్పుల స్వాతి, స్పోర్ట్స్ కార్యదర్శి దేవరశెట్టి సురేష్, లాజిస్టిక్స్ కార్యదర్శి సోమిసెట్టి పవన్ పాల్గొన్నారు.