అమెరికాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బే ఏరియా లోని తెలుగువారు నిర్వహించే అతి పెద్ద, అత్యంత ఆదరణ ఉన్న వేడుకలలో ఉగాది ఒకటి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో ఉన్న ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు రెండు వేల మంది అతిథులు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు మొదలైన ఈ వేడుకలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి.


ఈ కార్యక్రమానికి ప్రజెంటర్ గా సంజీవ్ గుప్తా సీపీఏ వ్యవహరించారు. ఈ ఈవెంట్ కు నాగరాజ్ అన్నియ్య సహకారం అందించారు. గోల్డ్ స్పాన్సర్ గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్, పీఎన్ జీ జ్యూవెలర్స్ వ్యవహరించారు. ఇన్ స్టా సర్వీస్, శిఖా కపూర్ (రియల్టర్) ఎంసీఎస్ మాస్టర్ క్లాస్, వచి సిల్క్స్, పాఠశాల (తెలుగు స్కూల్), మహాకాళేశ్వర్ ఆలయంలు మిగతా స్పాన్సర్లుగా వ్యవహరించారు.


ఈ కార్యక్రమం విజయవంతం చేసిన బాటా సలహా మండలి సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి బాటా టీమ్‌కు అభినందనలు తెలిపారు. వీనుల విందైన సంగీతం, ఆటలు, పాటలు, ఆటల పోటీలు, డ్యాన్స్ లు, ఆహ్లాదకరమైన పండగ వాతావరణంలో సాయంత్రం పూట ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన స్పాన్సర్లను వేదిక మీదకు పిలిచి బాటా కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. తానా కమిటీ సభ్యులు వెంకట్ కోగంటి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఏడాది జులైలో డెట్రాయిట్ లో జరగనున్న తానా కాన్ఫరెన్స్ కు వారిని ఆహ్వానించారు.
