కెనడాలోని గ్రేటర్ టొరంటోలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యం లో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. గుప్తేశ్వరి వాసుపిల్లి, సరిత ప్యారసాని, ప్రసన్న గుజ్జుల, భవాని సామల, విజయ చిత్తలూరి జ్యోతి ప్రజ్వలన చేయగా,గుప్తేశ్వరి వాసుపిల్లి గణేష వందనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ పూజారి నరసింహ చారి పంచాంగ శ్రవణం చేశారు. స్థానిక చిన్నారులతో ప్రవీణ్ నీలా దర్శకత్వంలో రచించబడిన కృష్ణం వందే జగద్గురుం నాటిక ప్రేక్షకులను మనోరింజింపజేసింది. మనబడి చిన్నారులు ప్రదర్శించిన బుర్రకథకు విశేషాదరణ లభించిం ది. వీరితోపాటు పలువురు పెద్దలు, చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలతో 4 గంటలపాటు ఆహుతులను అలరింపజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం అధికారిక తెలుగు పత్రిక టీసీఏ ఉగాది సంచిక ను ఎన్సీపీఎల్ అధినేత రాంబాబు వాసుపిల్లి ఆవిష్కరించి పాలకమండలి సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాతృభాష ప్రాముఖ్యతను భావితరాలకు అందజేయడానికే ఈ సంచికను తీసుకొచ్చా మని తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్లపల్లి, రాజేష్ అర్ర, స్ఫూర్తి కొప్పు, కుమారి ప్రహళిక మ్యాకల, వేణుగోపాల్ ఏళ్ళ, దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, హరి రాహుల్, కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, ప్రకాష్ చిట్యాల, రాజేశ్వర్ ఈద, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం, నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, ప్రవీణ్ కుమార్ శ్యామల, భగీరథ దాస్ అర్గుల, నవీన్ ఆకుల, మాధురి చాతరాజు, అతిక్ పాషా, 1500 మందికిపైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.