నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న చిత్రం అగ్లీ స్టోరీ. ప్రణవ స్వరూప్ దర్శకత్వం. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఊహల్లోని ప్రేమ నిజ జీవితంలో ఉండదనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేమ తాలూకు యువతీయువకుల ఆలోచనల ను వాస్తవిక కోణంలో ఆవిష్కరిస్తుంది. నందు పాత్రతో నేటి యువత బాగా కనెక్ట్ అవుతారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టీజర్, ట్రైలర్‌ను విడుదల చేస్తాం అన్నారు. రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీసాయికుమార్ దారా, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, సాహిత్యం: భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, కడలి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ స్వరూప్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)