గతవారం జోర్డాన్ లోని అమెరికా స్థావరంపై జరిగిన డ్రోన్ దాడికి అగ్రరాజ్యం ప్రతీకారం తీర్చుకుంటున్నది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలపై అమెరికా యుద్ధవిమానాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా యూకే కలిసి అమెరికా సైన్యాలు యెమెన్‌లో ని హౌతి రెబల్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించాయి. హౌతీలకు చెందిన కమాండ్ కంట్రోల్‌తోపాటు 36 స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం తెలిపింది.యెమెన్‌ను స్థావరంగా చేసుకున్న హౌతీ రెబల్స్, ఇజ్రాయెల్ సైన్యాలు గాజాలోని పాలస్తీనియన్లను చంపడానికి నిరసగా అమెరికా, దాని భాగస్వామ్య దేశాలపై దాడులకు పాల్పడుతున్నది. ఇందులో భాగంగా ఎర్రసముద్రంలో గతకొంత కాలంగా వాణిజ్య నౌకలను డ్రోన్ బాంబుల సాయంతో ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే.