Namaste NRI

భారతీయ విద్యార్థులకు బ్రిటన్ బంపర్ ఆఫర్

భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌  తీపి కబురు వినిపించింది. ఉన్నత విద్య కలలతో తమ దేశం వైపు చూస్తున్నవారిని సాదరంగా ఆహ్వానిస్తోంది. తమ విద్యా సంస్థల్లో చదవడానికి  వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్యను ఏటేటా పెంచుకుంటూ పోతోంది. 2012కి గానూ రికార్డు స్థాయిలో ఆశావహులకు సింహాసనం వేసింది. కేంద్రీకృత దరఖాస్తు విధానం ద్వారా యూకే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఏకంగా 3,200 మందికి ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 19 శాతం అధికం కావడం విశేషం. ది యూనివర్సిటీస్‌ అండ్‌ కాలేజెస్‌ అడ్మిషన్స్‌ సర్వీస్‌ (యూసీఏఎస్‌) ఈ వివరాలను విడుదల చేసింది.

                 మహమ్మారి నేపథ్యంలో ప్రయాణ నిషేధానికి సంబంధించి భారత్‌ను కొన్ని రోజుల క్రితమే రెడ్‌ జాబితా నుంచి ఆంబర్‌ జాబితాకు మార్చి ఊరట కలిగించింది బ్రిటన్‌. బ్రిటన్‌ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు మేలు చేకూరుస్తాయని వివేష్లకులు చెబుతున్నారు. మరోవైపు గత జులైలో అమల్లోకి వచ్చిన యూకే పోస్ట్‌ స్టడీ వీసా కూడా భారతీయ విద్యార్థులకు వరంలా మారింది. చదువు పూర్తయిన తర్వాతా రెండేళ్ల వరకూ బ్రిటన్‌లోనే ఉండి ఉద్యోగానుభవం సంపాదించుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది.

Social Share Spread Message

Latest News