Namaste NRI

నిబంధనలు ఎత్తివేతివేసిన యూకే

బ్రిటన్‌లో గత రెండు వారాలుగా కరోనా కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఒమిక్రాన్‌ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. నిర్భంద ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌ వంటి నిబంధనల నుంచి ప్రజలకు మినహాయింపునిచ్చారు. దీంతో లండన్‌ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒమిక్రాన్‌ కేసులు తగ్గుతుండటంతో ఈ నిబంధనలు ఎత్తివేశారు. అయినప్పటికీ కరోనా పాజిటివ్‌గా తేలినవారు ఐదు రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేశారు.

                        ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తుండటంతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ డిసెంబర్‌ 8న బ్రిటన్‌లో కరోనా ఆంక్షలు విధించారు.  నిర్భంద ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేశారు. నైట్‌ క్లబ్బులు, పుట్‌బాల్‌ స్టేడియాలు, భారీ ఈవెంట్లకు  వెళ్లాలంటే వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events