Skip to main content

Namaste NRI

రష్యా ఆరోపణలను.. ఖండించిన ఉక్రెయిన్‌

రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌ అధికార నివాసంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు ప్రయత్నించిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌ చెప్పారు. నోవ్‌గోరోడ్‌ ప్రాంతంలో అధ్యక్షుడి నివాసాన్ని టార్గెట్‌ చేస్తూ ఓ రోజు రాత్రి ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేసినట్టు ఆయన ఆరోపించారు. అయితే వీటిని రష్యా విజయవంతంగా అడ్డుకుందని, గగనతల రక్షణ వ్యవస్థ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను కూల్చేసిందని ఆయన పేర్కొన్నారు. రష్యా ఆరోపణల్ని ఉక్రెయిన్‌ ఖండి చింది. మరిన్ని సైనిక దాడులు చేపట్టేందుకు, శాంతి చర్చల్ని దెబ్బతీసేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నంగా ఉక్రెయిన్‌ తెలిపింది.

Social Share Spread Message

Latest News