రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరి పూర్తిగా మారుతున్నది. ఇంతకాలం యుద్ధానికి రష్యానే కారణమని ఆరోపిస్తూ, ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్న అమెరికా ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్నది. యుద్ధానికి ఉక్రెయినే కారణమని ఫ్లోరిడాలోని తన నివాసంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ మండిపడ్డారు. నువ్వు(ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ) యుద్ధాన్ని ప్రారంభించి ఉండాల్సింది కాదు. ఇందుకు బదులుగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఉండాల్సింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
