ఉక్రెయిన్ సరిహద్దు పరిస్థితులపై తగ్గేదేలే అంటూనే ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరం మార్చారు. రష్యా దాడుల్ని సమర్థవంతంగా వెనక్కి తిప్పికొడతామని, అవసరమైతే అనుబంధ ప్రాజెక్టులను నిలిపివేస్తామని ప్రకటించిన 24 గంటలు గడవక ముందే వెనక్కి తగ్గారు. ఉక్రెయిన్‌లో ఉంటున్న అమెరికా పౌరులను వెనక్కి వచ్చేయాలంటూ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్‌ను తక్షణమే వీడాలని అమెరికన్లను కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలలో ఒకటైన (రష్యాను ఉద్దేశిస్తూ) దానితో మేం డిల్ చేయబోతున్నాం. ఇది చాలా భిన్నమైన పరిస్థితి. ఏ క్షణమైనా పరిస్థితులు క్రేజీగా మారవచ్చు. వెంటనే వెనక్కి వచ్చేయండి అంటూ అమెరికా పౌరులను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యానించారు.