Namaste NRI

స్విస్‌లో ఉక్రెయిన్ శాంతి సదస్సు.. ప్రధాని మోడీ కూడా హాజరు?

స్విట్టర్లాండ్‌లో ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు జరిగే ఉన్నత స్థాయి సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్న దశలో తలెత్తిన సంక్షోభ నివారణకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ భేటీకి రష్యా, చైనాలు వెళ్లకపోవ చ్చు. ఇక్కడి శాంతిసదస్సుకు ముందు ఇటలీలో జి 7 సమ్మిట్ జరుగుతుంది. దీనికి భారతదేశంతో పాటు ప్రధాన గ్లోబల్ సౌత్ దేశాలకు ఆహ్వానాలు అందాయి.

స్విట్జర్లాండ్ శాంతి సదస్సు ఈ నెల 15, 16 తేదీలలో ఖరారు అయింది. అంతకు ముందు రోజు ఇటలీలో జరిగే జి 7 సమ్మిట్‌కు వచ్చే నేతలు ఈ సదస్సుకు తరలివచ్చే వీలుంది. ఈ సదస్సు ఏర్పాటు ప్రాతినిధ్యం గురించి ఇప్పటికే స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్, బ్రెజిల్, చైనా, ఇథియోపియా, బ్రెజిల్, చైనా, అరేబియా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు , ఆయాదేశాల రాయబార్లతో చర్చించింది. శాంతిస్థాపన దిశలో జరిగే ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరింది. ఇప్పటికైతే సదస్సుకు హాజరీ విషయంలో చైనా, రష్యాల నుంచి ఎటు వంటి స్పందన వెలువడలేదు. ఇప్పటికే రష్యా ఈ సదస్సు వల్ల ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events