యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అభ్యర్థించారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రత్యేక విధానం ద్వారా ఐరోపా కూటమిలో సభ్యత్వం కల్పించాలని ఆయన కోరారు. కొత్త ప్రత్యేక విధానం ద్వారా ఉక్రెయిన్‌ను తక్షణమే చేర్చుకోవాలని యూరోపియన్ యూనియన్‌కు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది మా లక్ష్యం. ముఖ్యంగా సమాన హోదా కలిగి ఉండటం. ఇది న్యాయమైనదని నేను అనుకుంటున్నాను. ఇది సాధ్యమవుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)