రష్యా దేశానికి ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సుధీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఈ యుద్ధంలో రెండు దేశాలకు చెందిన సైనికులు ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లో పలు నగరాలు ధ్వంసం కావడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. మరోవైపు యుద్ధ సామాగ్రి కోసం రెండు దేశాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. రోజూ వందల సంఖ్యలో సైనికుల ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ క్రమంలో రష్యా సైన్యానికి చెందిన కీలక అధికారి ఉక్రెయిన్ క్షిపణి దాడిలో మరణించాడు. మేజర్ జనరల్ సెర్గీ గోర్యచెవ్ క్షిపణి దాడిలో మృతిచెందాడని రష్యన్ మిలిటరీ బ్లాగర్ వెల్లడించారు. గోర్యచెవ్ మృతితో రష్యా 5th ఆర్మీ బలగాలు బలవంతంగా దక్షిణ డొనెస్క్‌లోని మకరివ్‌కా నగరాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. మరోవైపు ఉక్రెయిన్ బలగాలు పోరాడుతూ రష్యా అధీనంలోకి వెళ్లిన పలు గ్రామాలకు విముక్తి కల్పిస్తున్నాయి.