దేశ రక్షణలో ఉక్రెయిన్ పౌరులు చూపుతున్న దైర్యసాహసాలు, హీరోయిజం అద్భుతమని పోప్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. రష్యాపై తొలిసారిగా తీవ్ర పదజాలం ప్రయోగించారు. ఉక్రెయిన్‌లో రష్యా దళాలు చెప్పలేనంత క్రూరత్వానికి, అకృత్యాలకు పాల్పడుతున్నాయంటూ మండిపడ్డారు. ఇంతటి క్లిష పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ ప్రజలు అద్భుతంగా పోరాడుతున్నారని అన్నారు. తూర్పున విస్తరించేందుకు నాటోచేసిన ప్రయత్నాలే రష్యాను యుద్దానికి పురిగొల్పాయని అభిప్రాయపడటం విశేషం.














