తమ దేశంలో చదివే విదేశీ విద్యార్థుల కనీస పొదుపు మొత్తాన్ని 2020 తర్వాత యూకే మొదటిసారి పెంచింది. 2025 జనవరి 2 నుంచి యూకేకు వచ్చే విద్యార్థులకు ఇది అమలు కానుంది. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా తమ చదువుల కోసం తమ వద్ద తగినంత పొదుపు మొత్తం ఉందని ఆధారాలు చూపించాలి.తమ కోర్సుకు సంబంధించి తొమ్మిది నెలల వరకు ప్రతి నెల ఖర్చుల కోసం తమ వద్ద తగినంత మొత్తం ఉందని విద్యార్థులు ఆధారాలు చూపించాలని హోం శాఖ కార్యాలయం తెలిపింది. లండన్‌లో ఉండే విద్యార్థులు నెలకు 1483 పౌండ్లు, లండన్ బయట చదివేవారు 1136 పౌండ్లు తమ వద్ద ఉన్నాయని ఆధారాలు చూపాలి.