1990 ప్రచ్ఛన్న యుద్ధంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే అది మహా వినాశనానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రికత్తల నేపథ్యంలో తూర్పు ఉక్రెయిన్లోని పౌరులను రష్యాకు తరలిస్తున్నట్టు వేర్పాటువాద నాయకుడు డానిష్ పుషిలిన్ తెలిపారు. పిల్లలు, మహిళలు, వృద్దులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. వీరి కోసం రష్యా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచారు.
