రోహిత్ బెహల్, అపర్ణ జనార్థన్ జంటగా నటిస్తున్న చిత్రం లవ్ యూ రామ్. ఈ చిత్రానికి డీవై చౌదరి దర్శకుడు. సీనియర్ దర్శకుడు కె.దశరథ్, డీవై చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాంగ్ టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశరథ్ అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకుడు. నిర్మాతగా కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. కె దశరథ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం చాలా మంది ప్రతిభ గల యువకులు పని చేస్తున్నారు. స్క్రీన్ ప్లే కిషోర్, శివ అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాస్తున్నారు. ఉద్దవ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కె వేద మంచి మ్యూజిక్ ఇచ్చారు అని తెలిపారు. దర్శకుడు డివై చౌదరీ మాట్లాడుతూ ఈ సినిమా కోసం హరీష్ కూడా తన విలువైన సూచనలు ఇచ్చారు. ఇందులో దశరథ్ నటించారు. చాలా మంచి నటన కనబరిచారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోహిత్ బెహల్, అపర్ణ పాల్గొన్నారు.
