Namaste NRI

కమ్మ యువ సేవా సమితి, చేతనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో… పేద విద్యార్థులకు

అమెరికాలోని బే ఏరియాకు చెందిన కమ్మ యువ సేవా సమితి సహకారంతో చేతనా ఫౌండేషన్‌ (యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో గ్రామీణ పేద విద్యార్థినులకు రూ.22 లక్షల స్కాలర్‌షిప్‌లను అందించారు. గుంటూరులోని కమ్మ  జన సేవాసమితి బాలికల హాస్టల్‌లో చదువుతున్న 150 మంది విద్యార్థినులకు రూ.15 వేలు చొప్పున అందజేశారు. భవిష్యత్తులోనూ ఇలాగే పేద విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లను అందించడమే కాకుండా వారికి కెరీర్‌పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని కేవైఎస్‌ఎస్‌ సభ్యుడు సత్య పువ్వాడ తెలిపారు. నాలెడ్జ్‌ ఎకానమీలో రాణించాలంటే ఉన్నత చదువులే ఏకైక మార్గమని క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి విజయాలు సాధించవచ్చన్నారు. గుంటూరులోని స్థానిక కళాశాలల్లో ఉంటూ డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్థినుల ఆర్థిక కష్టాలు చూసి వారి హాస్టల్‌ ఖర్చులు భరించేందుకు కేవైఎస్‌ఎస్‌ సభ్యులు రావడం పట్ల కమ్మ జన సేనా సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మ జనసేవా సమితి, చేతనా ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News