కాన్సాస్ సిటీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా ఆడవారికి ముగ్గుల పోటీలు, పిల్లలకు చదరంగం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీలు జరుగుతున్నంతసేపూ కళాకారులు మాతృదేశంలో తమ సంక్రాంతి సంప్రదాయాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సంఘం అధ్యక్షురాలు శ్రావణి మేక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పోటీల్లో గెలిచిన వారికి ప్రముఖ సినీ నటులు మురళీమోహన్ కుమార్తె మధు బిందు తుమ్మల, నందిని పచ్చళ్ల, అను ఆర్నిపల్లి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన సంఘం కార్యవర్గం సభ్యులకి, స్పాన్సర్లకు సంఘం అధ్యక్షురాలు శ్రావణి మేక, ట్రస్ట్ ఛైర్ శ్రీని పెనుగొండ ధన్యవాదాలు తెలిపారు.