Namaste NRI

ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఆధ్వర్యంలో.. ఆత్మీయ సమ్మేళనం

ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే నూతన కార్యవర్గ ఆత్మీయ సమ్మేళనం ఈస్ట్‌ లండన్‌లో జరిగింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ అఫైర్స్ చైర్‌పర్సన్‌ రమేశ్‌ ఎసెంపల్లి, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేశ్‌ కుప్పలా మాట్లాడుతూ  ఎన్నారై లంతా కేసీఆర్ వెంట ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. మరో ఉద్యమానికి మనమంతా సిద్ధంగా ఉండి, విధ్వంసమవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్‌ అరాచక పాలన గురించి వివరించారు. ప్రవాస సంఘాల మద్దతు కూడా బీఆర్‌ఎస్‌కు ఉండాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకేకు అన్ని ప్రవాస తెలంగాణ సంఘాలు అండగా ఉన్నట్లుగానే,  రాబోయే రోజుల్లో సైతం అలాగే ఉంటూ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసుకుందామని సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ రావు కటికనేని కోరారు.

ఈ సందర్భంగా   బీఆర్‌ఎస్‌ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం, కార్యదర్శి సురేశ్‌ గోపతి ఆధ్వర్యం లో లండన్‌లో నివాసం ఉంటున్న ఉదయ్‌ కూరపాటి (వరంగల్‌), దీపక్‌ అప్పాని(హైదరాబాద్‌) సహా పలువురు ఎన్నారైలు గులాబీ కండువా కప్పుకున్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఉదయ్‌ కూరపాటి, దీపక్‌ అప్పాని సహా బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు ఎన్నారై లు అన్నారు. తెలంగాణలో సంవత్సర కాలంగా జరిగిన విధ్వసం చూసి చాలా బాధపడుతున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడి కేసీఆర్, కేటీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరామని చెప్పారు.

ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం, ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షు డు నవీన్‌ రెడ్డి, కార్యవర్గసభ్యులు, టీడీఎఫ్‌ యూకే నాయకులు కమల్ ఓరుగంటి,  శ్రవణ్ ఉప్పల, శశి, నగేశ్‌, జాగృతి యూకే నాయకులు సుమన్ రావు  బాలమూరి, రోహిత్ రావు , రఘు, వంశీ,  హైదరాబాద్ బావర్చి రెస్టారెంట్ అధినేత కిశోర్ మునగాల , డాక్టర్ కిరీటి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events