తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలోని దక్షిణాఫిక్రాలోని పలు ప్రాంతాల్లోని ప్రవాసీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 78 లారెన్స్ స్ట్రీట్, హాఫ్‌వే హౌస్, మిడ్రాండ్‌లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసీయులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం దక్షిణాఫ్రికా సభ్యులతో పాటు పలువురు పార్టీ సానుభూతిపరులు నిరసనలో పాల్గొన్నారు.
