తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా విదేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తున్నాయి. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ప్రవాసాంధ్రుల ఆందోళన బాట పట్టారు. బాబుతో మేము సైతం అంటూ ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో కువైట్‌లో నిరసనకు దిగారు. సైకో పోవాలి బాబు రావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. విజనరీ నేత చంద్రబాబును అరెస్టు చేయడం అంటే అభివృద్ధిని జైల్లో పెట్టడమేనని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
