అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగరంలో అట్లాంటా తెలుగు చర్చి ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. అట్లాంటా తెలుగు చర్చి ఆధ్వర్యంలో 11 ఏళ్లుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ బిల్లా, సుధ మాట్లాడుతూ ఏసు మన రోజువారీ జీవనంలో జోక్యం చేసుకొంటూ, మనల్ని దైవత్వం వైపు నడిపిస్తారని తెలిపారు. ప్రార్థన అనంతరం అంతా పాటలు, నాటికలతో క్రిస్మస్ సందేశం అందించారు. అమెరికాలోని ఇతర రాష్ట్రాల భక్తులు సైతం ఆరాధనలో పాల్గొన్నారు.